మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత

UPDATED 21st FEBRUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: మాతృభాషా పరిరక్షణ ప్రతీ పౌరుడి ప్రాథమిక బాధ్యత అని, తెలుగు భాషా పరిరక్షణ మహోద్యమంలో అందరూ భాగం పంచుకుని భావితరాలకు తెలుగుదనాన్ని వారసత్వంగా అందించాలని హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల భాషా క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య వారసత్వ సంపదకు, జాతి మనుగడకు విషయ వికాసానికి మాతృభాష ఎంతో దోహదం చేస్తుందని, సామాన్య ప్రజలు కూడా మాతృభాష లోనే భావ వ్యక్తీకరణ ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారని, అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు బి. శ్రీలక్ష్మి, చంద్రమోహన్ మాట్లాడుతూ దేశభాష లందు తెలుగు లెస్స అని, తెలుగు భాష ద్వారా మన పూర్వీకుల సాహిత్య సంపద తెలుసుకోవచ్చని, తెలుగు వెలుగులు భవిష్యత్తుకు సోపానాలు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాతృభాషలో మాట్లాడడం, వేమన పద్యాలు వల్లె వేయడం తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ.ఎల్.వి. కుమారి, ఏపి రాజేంద్రకుమార్, షఫీ, కె. అరుణ, గోవిందు, కెవివి సత్యనారాయణ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us