సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సర్వం సిద్ధం

UPDATED 30th AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): గ్రామాల్లో వినూత్న పాలనకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు సిద్ధమైంది. గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షల కోసం అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి జరగనున్న సచివాలయ గ్రామ కార్యదర్శుల పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో కర్రి స్వప్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో 3688 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని అన్నారు. పవర గ్రామంలో గల పరీక్షా కేంద్రంలో 48 మంది దివ్యాంగులు పరీక్షలు రాయనున్నారని, వారికి వీల్ చైర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేదిలేదని  అన్నారు. పరీక్షలు సందర్భంగా అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయడం జరుగుతుందని, అలాగే పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రోజు ముందుగానే 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేంద్రాలకు సంబంధించిన పరీక్ష పత్రాలు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఎనిమిది పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు పరీక్షా  కేంద్రాలకు సంబంధించిన పరీక్ష పత్రాలు పూర్తి భద్రతతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతున్నాయని, మధ్యవర్తులు, దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె అభ్యర్థులకు తెలియజేశారు. ఈ సమావేశంలో ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, సూపరెంటెండెంట్ విప్పర్తి సాయిబాబా, ఉపాధి హామీ అధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us