UPDATED 25th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పట్టణ పరిధిలోని స్థానిక 30 వార్డులోని కనకదుర్గ ఆలయం వద్ద విజయదశమి ఉత్సవాలు సందర్భంగా బుధవారం పందిరి వేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వీరరాఘవపురం ప్రాంతానికి చెందిన సప్పా సత్యన్నారాయణ(48) పందిరి వేస్తుండగా పైనుంచి జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. హుటాహుటిన అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై లోవరాజు తెలిపారు.







