UPDATED 27th JANAUARY 2020 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్ననాలుగు మున్సిపల్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.వి.వి. సత్యనారాయణమూర్తి ఆర్థిక సహాయంతో ఐదురోజుల పాటు సాయంత్రము అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందచేస్తున్న అల్పాహార సదుపాయాన్ని మున్సిపల్ కమీషనర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని పదికి పది పాయింట్లు సాధించడంతో పాటు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. అల్పాహారం ఏర్పాటు చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు సత్యనారాయణమూర్తిని మున్సిపల్ కమీషనర్ అభినందించారు. అలాగే అల్పాహారం అందచేసే దాతలు ఎవరైనా ఉంటే తమ ఏరియాలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఆయన కోరారు.







