ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసిన ఓఎన్జీసీ ఈడీ ఆదేష్ కుమార్

రాజమహేంద్రవరం:17 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రాజమండ్రి అసెట్ ) గా బాధ్యతలు స్వీకరించిన ఈడీ ఆదేష్ కుమార్ స్థానిక ఎంపీ భరత్ రామ్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలుసుకున్నారు. ఓఎన్జీసీలో జరుగుతున్న కార్యకలాపాలను ఎంపీకి ఆయన వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేష్ కుమార్ ను శాలువా కప్పి ఎంపీ ఘనంగా సత్కరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాను తలపెట్టబోయే మంచి కార్యక్రమాలకు, సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి సహకరించాలని ఎంపీ ఈడీని కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us