ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మెలగాలి

UPDATED 2nd DECEMBER 2020 WEDNESDAY 8:00 PM

రాజానగరం (రెడ్ బీ న్యూస్): కరోనా వైరస్ నివారణ కోసం మాస్కులు ధరించి భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రతీ ఒక్కరూ భాద్యతగా మెలగాలని కెఎల్ఆర్ లేనోరా దంత వైద్య కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సబ్బులు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన నాల్గవ తరగతి సిబ్బందికి ఆమె చేతుల మీదుగా సబ్బులు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎంతో అభినందనీయమని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ స్టేట్ మేనేజ్ మెంట్ మెంబెర్, కళాశాల కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us