ప్రత్యేక అలంకరణలో బాలాత్రిపురసుందరి అమ్మవారు

సామర్లకోట,28 ఆగస్టు 2020 (రెడ్ బీ న్యూస్):పంచారామ పుణ్యక్షేత్రమైన సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర సమేత బాల త్రిపుర సుందరి అమ్మవారి గర్భాలయానికి దాత బోడె రామచంద్ర యాదవ్ ఆర్ధిక సహకారంతో సుమారు రూ. 8 లక్షల విలువైన వెండి మకర తోరణం, వెండి ద్వార అలంకరణ నిర్వహించి ఆలయ ఈవో పులి నారాయణమూర్తికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులచే వెండి ఆభరణాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 14 కిలోల 803 గ్రాముల వెండిని 10 విభాగాలుగా రూపొందించి గర్భాలయానికి అత్యంత రమణీయంగా అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర యాదవ్ దంపతులు, నోరి కృష్ణారావు, వేదపండితులు కొంతేటి జోగారావు, శర్మ, రాంబాబు వెంకన్న, గుమస్తా వీరభద్రరావు, తదితర భక్తులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us