సేవాతత్పరుడు డాక్టర్ చిన్నయ్యదొరను గెలిపించండి

UPDATED 7th APRIL 2019 SUNDAY 6:00 PM

పెద్దాపురం: మంచి మనిషి, సేవాతత్పరుడు జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొరను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని బుల్లితెర నటులు శైలజ (ఆడదే ఆధారం ఫేం), మాధవిరెడ్డి (రాజన్న, మహానటి) పద్మజయంతి (లక్ష్మీ, సమరసింహారెడ్డి), శోభారెడ్డి (పెదబాబు, హంగామా) పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ తరపున పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొరకు మద్దతుగా వారు మండల పరిధిలో గల గుడివాడ, సిరివాడ, కాండ్రకోట, ఉలిమేశ్వరం, తదితర గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకుండానే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి డాక్టర్ చిన్నయ్యదొర అని, ఎందరో కళాకారులను గుర్తించి ప్రోత్సాహించిన ఆయన లాంటి నిజాయితీపరుడు మీ నియోజకవర్గంలో ఉండడం అదృష్టమని అన్నారు. ప్రతీ ఒక్కరూ జై భారత్ నేషనల్ పార్టీ గుర్తు గాజులు గుర్తుకు ఓటేసి చిన్నయ్య దొరను గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాకు ఒక్క అవకాశం ఇస్తే నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. చాలా మందిలో ఓటు వేస్తే ఏమౌతుందోనన్న అపోహ  ఉందని, అలాంటివి పక్కన పెట్టి మీరు ఓటు వేస్తే నాకున్న ఆదరణతో మీ ఓటుతోనే విజయం సాధిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీవీవీ సత్యన్నారాయణ, కె.ఆబ్బాస్, దొరబాబు, సత్యశ్రీ, శర్మ, తదితరులు పాల్గొన్నారు.
 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us