ఏఐసిసి సభ్యుడుగా పెద్దిరెడ్డి

UPDATED 16th MARCH 2018 FRIDAY 6:00 PM

ఏలూరు: ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా పెద్దిరెడ్డి ప్రదీప్‌ నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పార్టీకి వెన్నంటే ఉంటూ, పార్టీ ఆదేశాలను ఎప్పటికప్పుడు శిరసావహిస్తూ పార్టీ తరపున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్‌కు ఏఐసిసి సభ్యుడిగా అవకాశం కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఐదుగురు సభ్యులకు ఏఐసిసిలో అవకాశం ఇవ్వగా, అందులో వట్టి వసంత్‌కుమార్‌, కనుమూరి బాపిరాజు, జెట్టి గురునాధం, అమర్జహా బేగ్‌, పెద్దిరెడ్డి ప్రదీప్‌లు ఉన్నారు. ఏఐసిసిలో సభ్యులందరూ కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు వంటి అత్యున్నత పదవులు అధిరోహించిన వారే ఉండగా, చిన్నవయసులోనే ఏఐసిసి సభ్యుడిగా ప్రదీప్‌ను ఎంపికకావడం  పార్టీ పట్ల ప్రదీప్‌ చూపిస్తున్న విధేయతకు నిదర్శనమని పలువురు కొనియాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్‌పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నూతనోత్సహంతో పనిచేసిన ప్రదీప్‌కు ఈ అవకాశం రావడం ముదావహమన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డికి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, మాజీ కేంద్రమంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీలకు ప్రదీప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నుంచి మార్చి18 వరకు ఏఐసిసి ప్లీనరీ జరుగుతుందని, దీనికి ఏఐసిసి సభ్యులందరూ హాజరుకానున్నారు. ప్లీనరీలో పార్టీ పునర్నిర్మాణంకోసం, పార్టీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కీలక భేటీ జరుగుతుందన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us