ఆరోగ్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించండి

UPDATED 11th NOVEMBER 2019 MONDAY 5:00 PM

మండపేట(రెడ్ బీ న్యూస్): ఆరోగ్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు యూనియన్ నాయకుల పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని అందచేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలుసుకున్న వారిలో ద్వారపూడి ఆరోగ్య మిత్ర వి. కళ్యాణి, మండపేట నెట్ వర్క్ ఆరోగ్య మిత్ర ప్రసాద్, తదితరులు ఉన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us