పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు

UPDATED 18th JUNE 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: బడి పిలుస్తోంది వారోత్సవాల్లో భాగంగా స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నా ఊరు-నా చెట్టు కార్యక్రమంలో భాగంగా పాఠశాల హెచ్ఎం యు. సత్యనారాయణ, పిఇటి టి. వైకుంఠం ఆధ్వర్యంలో విద్యార్థులచే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించి ప్రకృతి ప్రార్థన చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను విద్యార్థులకు దత్తత ఇచ్చి, అనంతరం విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పిఇటి వైకుంఠం మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీ విద్యార్థి మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బి. రాజేశ్వరి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us