UPDATED 11th JULY 2018 WEDNESDAY 8:30 PM
రాజానగరం: జనాభా నియంత్రణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, తద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని లెనోరా దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి అన్నారు. రాజానగరంలోని లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం జనాభాలో రెండో స్థానంలో ఉందని, అధిక జనాభా అభివృద్ధికి నిరోధకమన్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం ద్వారా జనాభాను నియంత్రించవచ్చని, బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయన్నారు. 2018 సంవత్సరాన్ని కుటుంబ నియంత్రణ-మానవ హక్కు అనే నినాదంతో పనిచేయాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దాల్ సింగ్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అందుకు ప్రజా దంత వైద్య విభాగం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్ షా, డాక్టర్ రవికుమార్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







