క్రీడాభివృద్ధికి అధిక ప్రాత్సాహం

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 9:30 PM

సామర్లకోట: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు అర్జున అవార్డు గ్రహీత ఎ. రమణారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న ఖో-ఖో, కబడ్డీ  క్రీడాకారుల శుక్రవారం శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులకు తగు సూచనలు, సలహాలు తెలియచేసి, ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ భోగిళ్ళ మురళీకుమార్, జిల్లా కోచ్ పోతుల సాయిప్రసాద్, ఊబా జాన్ మోజెస్, ఊబా జాన్ కెనడీ, మాగాపు గోపి, ముత్యం రాజబాబు, నేతల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us