ఆధునిక పరిజ్ఞానం భవిష్యత్తుకు ఉపయోగం

* ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ హెడ్ సర్ఫేస్ ఆదేష్ కుమార్
* గైట్ లో ప్రారంభమైన జాతీయ సదస్సు

UPDATED 17th OCTOBER 2019 THURSDAY 6:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలోని ఎంబిఏ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 ఎడాప్ టేషన్ అండ్ ఇన్నోవేషన్ అనే అంశంపై రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఓఎన్జీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ (హెడ్-సర్ఫేస్) ఆదేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో అనునిత్యం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయని, ఇలాంటి ఆధునిక మార్పులపై విజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ విధమైన సదస్సులు, సమావేశాల ద్వారా పొందే విజ్ఞానం ఎంబీఏ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఓఎన్జీసీలో సాంకేతికపరంగా వచ్చిన మార్పులను ఆయన విపులంగా వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన జెఎన్టీయుకె స్కూల్ మేనేజ్ మెంట్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ ఏ. కృష్ణమోహన్ మాట్లాడుతూ సాంకేతిక రంగంలో నాల్గవ జనరేషన్ ఇప్పటికే ప్రారంభమైందని, రానున్న కాలంలో మరిన్ని ఆధునిక మార్పులు వస్తాయని అన్నారు. వర్చువల్ రియాలిటీ ద్వారా లాజర్ షోలను ఉపయోగించి సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులను మన ప్రక్కనే ఉన్నట్లుగా చూపించవచ్చని అన్నారు. 2030 నాటికి సాంకేతిక రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. పరిశ్రమలు కోరుకునే విధంగా విద్యార్థుల్లో నైపుణ్యతను మరింత పెంచుకునేందుకు వీలుగా జెఎన్టీయుకె ఎంబీఏ సిలబస్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఆధునిక మార్పులు తెచ్చిన విశ్వవిద్యాలయాల్లో దేశంలో జెఎన్టీయుకె ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రొసీడింగ్స్ ను ఆదేష్ కుమార్, ఎరుడైట్ సంచికను కృష్ణమోహన్ ఆవిష్కరించారు. అనంతరం ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ జైన్, కన్సల్ టెంట్ డాక్టర్ భానుప్రకాష్,  జెఎన్టీయుకె అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. జ్యోతిర్మయి టెక్నికల్ సెషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గేయిల్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) ఎస్. ప్రభాకరరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, టి. వంశీకిరణ్, కె. వల్లీమాధవి, డైరెక్టర్ డాక్టర్ టి.వి. ప్రసాద్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఎం.వి. సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.వి.ఎస్.ఎన్. మూర్తి, లీలావతి, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.           

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us