ఆదిత్యలో ముగిసిన కాగ్నిటివ్&ఐవోటి వర్క్ షాప్

UPDATED 4th DECEMBER 2018 TUESDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎపి క్లౌడ్ సౌజన్యంతో రెండురోజులపాటు నిర్వహించిన కాగ్నిటివ్& ఐవోటి వర్క్ షాప్  విజ్ఞానదాయకంగా ముగిసినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎపి క్లౌడ్-మిరాకిల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (వైజాగ్)కు చెందిన లావణ్య, లక్ష్మణ్ లతో కూడిన నిపుణుల బృందం కంప్యూటర్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో  ఆధునిక సాంకేతికత, నూతన టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానం తదితర విషయాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని అన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విద్యార్థులు సుమారు 400 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్స్ గా ఎపి కౌడ్ డిజిటల్ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం పొందారని కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ వానతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రాజబాబు, వర్క్ షాప్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.ఎస్.ఆర్.ఎస్.ఎస్. రాజు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us