పెద్దాపురం:31 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్):
ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటరు ఓటు నమోదుపై స్పందించాలని ఆర్డీవో యస్. మల్లిబాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హాలులో జాబితా సవరణ, ఓటర్లును చైతన్య పరచడం, భాగస్వామ్యం చేయడం కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెద్దాపురం తహశీల్ధార్ బూసి శ్రీదేవి అధ్యక్షతన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మెప్మా, డ్వాక్రా యానిమేటర్స్ తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీవో మల్లిబాబు మాట్లాడారు. ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును కలిగి ఉండాలనే దృక్పథంతో ఎన్నికల కమిషన్ స్వచ్ఛమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రజలను చైతన్య పరచడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని అన్నారు. చాలామంది ఓటు నమోదు, మార్పులు, ఓటు బదిలీలు, తదితర అంశాలపై అవగాహన లేక ఓటు హక్కును కోల్పోతున్నారని అన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6, శాసనసభ నియోజకవర్గం నుంచి వేరే శాసనసభ నియోజకవర్గానికి మార్చుకోవడానికి ఫారం-7, ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఫారం-8, ఓటర్ల జాబితాలో ఎంట్రీలలో మార్పులు ఫారం-8ఏ, తదితర అంశాలపై పూర్తి సమాచారపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, మెప్మా కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి, యానిమేటర్స్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







