UPDATED 1st OCTOBER 2019 TUESDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల క్యాషియర్, మీడియా మేనేజర్ తోటకూర గంగాధర్ కుమారుడు బాల గణితావధాని తోటకూర వి.ఎస్.ఎస్. సాయివంశీ జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గణిత చదరాలు రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు అడ్డు వరుసలు మొత్తం, నిలువ వరసలు మొత్తం, కర్ణాల మొత్తం ఇలా ఎటు కూడినా 150 వచ్చే విధంగా 150 రకాల చదరాలను రూపొందించాడు. జాతీయ పర్వదినాలు, మహనీయుల పుట్టినరోజులు, తదితర వేడుకలకు ఈ విధంగా గణిత చదరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం తన పెదనాన్న, గురువు, జాతీయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ వద్ద అభ్యసించానని ఆదిత్య జూనియర్ కళాశాల (కాకినాడ)లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుచున్న సాయివంశీ తెలిపాడు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు సాయివంశీని అభినందించారు.







