UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM
రాజానగరం: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ 12వ జాతీయ సమావేశాలు ఈ నెల 22, 23 తేదీలలో రెండు రోజులు పాటు కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రిలో గల కెఎల్ఆర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల ప్రజా దంత వైద్య విభాగాధిపతి డాక్టర్ బి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశాల్లో ఆధునిక అంశాలు పరిశీలన, నూతన అంశాలు విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యమని, అలాగే పోస్టర్ ప్రెజంటేషన్, టేబుల్ టాప్ ప్రెజంటేషన్, క్విజ్ రంగాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందచేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాలకు ప్రజా దంత వైద్య విభాగం జాతీయ అధ్యక్షులు డాక్టర్ అరుణాదేవి, కార్యదర్శి డాక్టర్ సవ్యసాచిషా, డిసిఐ మాజీ సభ్యులు డాక్టర్ కె. సతీష్ కుమార్ తదితరులు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశంలో కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.







