UPDATED 16th MARCH 2018 FRIDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక వై.ఆర్.ఎల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వై. రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నన్నయ యూనివర్సిటీ ప్రకటించిన ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ వై. మాణిక్యం అభినందించి విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై. లావణ్య, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వై. జగదీష్, ఏవో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







