UPDATED 6th JANUARY 2020 MONDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జనవరి నెల 8 వ తేదీన జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం కార్యాలయం నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ మెహర్ కాంప్లెక్, స్టేషన్ సెంటర్, పిఠాపురం రోడ్ మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు బర్ల గోపాల్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, అధిక ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయరాదని అన్నారు. ఈ ర్యాలీ లో సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, బాలం శ్రీనివాస్, ఐఎంఎల్ డిపో హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు, అధ్యక్షులు నాళం సత్యనారాయణ, బర్రె ఆదినారాయణ, వెన్నెల గోవింద్, తలారి శ్రీను, బర్రె శ్రీను, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పెనుపోతుల సత్తిబాబు, ప్రకృతి ఈశ్వరరావు, కుంచే సుబ్రహ్మణ్యం, చిట్టిడి శ్రీను, డాన్ శ్రీను, చైతన్య, కరణం గోవింద్, తదితరులు పాల్గొన్నారు.







