UPDATED 25th MARCH 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలోని పొనుగుపాటి వారి వీధిలో శ్రీరామనవమి సందర్భంగా కర్రి అప్పలపాత్రుడు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామాలయం వద్ద ఆదివారం 30 మంది పేద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పదవ వార్డు కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చంధ సంస్థలు సమాజంలో పేదలకు తమ వంతు సహాయం అందిస్తే వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో "కేప్ వా" అధ్యక్షులు కర్రి వెంకట నాగేశ్వరరావు, సభ్యులు లెంక విద్యాసాగర్ పాత్రుడు, కె .రవిచంద్, ఎల్. శ్రీను, కె. సాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







