UPDATED 1st JULY 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఏడు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు తెలిపారు. వీటిలో విద్యుత్ తీగలు ఇంటిపై నుంచి వెళ్లడం ద్వారా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున తొలగించాలని, మాజీ సైనికులకు ప్రభుత్వం భూమిని ఇప్పించమని, అలాగే శ్మశానానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయమని, ఆస్తిని తీసుకుని కొడుకు బాగోగులు చూడడం లేదని, మంజూరు చేసిన స్థలానికి ప్రభుత్వ పట్టా ఇప్పించమని, స్థల వివాదానికి సంబంధించి సర్వే చేయించమని, ఇసుక ర్యాంపులు మూసివేయడం ద్వారా భవన కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నామని అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







