ఉత్తమ ఫలితాల సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

UPDATED 21st AUGUST 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: ఉత్తమ ఫలితాల సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని డివైఇవో డి. సుభద్ర అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మాటివ్ పరీక్షలు ఆధారంగా త్రిశూల్ పద్ధతిలో పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక ప్రణాళిక అమలును వివరించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడమే త్రిశూల్ పద్ధతి ముఖ్య వ్యూహమన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నూరుశాతం విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. డిస్ట్రిక్ట్ కామన్ ఎక్సామినేషన్ బోర్డు (డిసిఇబి) మార్గదర్శకాల ప్రకారం భోధనా ప్రణాళిక, డైరీలు నిర్వహణ, సిలబస్ పూర్తి తదితర అంశాలపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. పాఠశాలలో ఓపెన్ స్కూల్ నిర్వహణ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రం ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డివైఇవో అన్నారు. అనంతరం మున్సిపల్ శాఖ సమకూర్చిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, పిఇటి టి. వైకుంఠం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us