Dr. YSR Polambadi : రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి

UPDATED 24th AUGUST 2022 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : రైతులు రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని ఏడిఏ నల్లి దైవకుమార్ పేర్కొన్నారు. గ్రామ ఉద్యాన సహాయకుడు నరం సత్యనారాయణ ఆధ్వర్యంలో పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో బుధవారం నిర్వహించిన డాక్టర్ వైయస్సార్ పొలంబడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు విచ్చలవిడిగా పురుగు మందులు వాడకం తగ్గించి మిత్ర పురుగులు సంరక్షించాలని, జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నారు. జీవన ఎరువులు అయిన అజటోబాక్టర్, ఫాస్ఫో బ్యాక్టీరియాలను వినియోగించడం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చని అన్నారు. మండల వ్యవసాయ అధికారి కె. సంజయ్ కుమార్ రైతులకు ఎలుకల నిర్మూలన బ్రోమోడిలిన్ ఎర తయారుచేసే విధానం గురించి వివరించారు. త్వరలోనే ఎలుకల మందు ఎర రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని అన్నారు. నూకలు నూనె గ్రామ రైతులు సమకూర్చుకోవాలని, బ్రోమోడయోలీన్ మందును ప్రభుత్వం గ్రామానికి సరిపడా సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిసిఎన్ఎఫ్, ఎంసిఆర్ పి చినబాబు, జెడ్ బిఎన్ఎఫ్ ఐసిఆర్ పి జె. సరిత, కె. రమణ, రైతులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us