UPDATED 14th DECEMBER 2018 FRIDAY 6:30 PM
తాళ్లరేవు: ప్రపంచ వన్యప్రాణి సంరక్షణా సంస్థ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలు సంయుక్తంగా కోరంగి అభయారణ్యాల్లో నిర్వహిస్తున్న బర్డ్స్ ఫెస్టివల్ లో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫోరెన్సిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఇ. మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ ఫోరెన్సిక్ విద్యలో వైల్డ్ లైఫ్ గురించి పరిజ్ఞానం కలిగి ఉండటం వారి శిక్షణలో ముఖ్యపాత్ర వహిస్తుందని అన్నారు. వరల్డ్ వైడ్ బర్డ్ ఫోటోగ్రఫీ విభాగంలో తమ సంస్థ విద్యార్థులు పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో పాల్గోవడం ద్వారా విద్యార్థులు మంచి పరిజ్ఞానం పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.







