UPDATED 27th FEBRUARY 2019 WDNESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఏఎస్, ఎస్ఎల్ఏఎస్ లపై ఉపాధ్యాయులకు రెండురోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ మండల పరిధిలోని 73 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చిట్టిచేతులు చక్కని రాతలు పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.







