రూ. ఆరులక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

UPDATED 10th JUNE 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట నుంచి పలు ప్రాంతాలకు తరలిస్తున్న రూ. ఆరు లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు మాట్లాడుతూ తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఒక వాహనంలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లను తరలించడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్, క్రైమ్ ఎస్సై వల్లి, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us