ఆదిత్య ప్రొఫెసర్ రామకృష్ణకు డాక్టరేట్

UPDATED 24th OCTOBER 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ అంగజాల ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(డాక్టరేట్) పొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉపకులపతి ప్రొఫెసర్ వి. వీరయ్య గైడెన్స్ తో రామకృష్ణ సమర్పించిన "స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ మాగ్నటిక్ ప్రోపర్టీస్ ఆఫ్ కాపర్ సబ్ స్టిట్యూట్డ్  కోబాల్ట్ నానో ఫెర్రీట్స్" అనే థీసిస్ కు గాను డాక్టరేట్ పొందారని అన్నారు. డాక్టర్ రామకృష్ణ ఆదిత్యలో దశాబ్దకాలం పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ గా వివిధ హోదాలలో పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది, తదితరులు డాక్టర్ రామకృష్ణను అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us