UPDATED 6th DECEMBER 2017 WEDNESDAY 9:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో "ఆంగ్ల భాషా బోధనలో నూతన ఆవిష్కరణలు" అనే అంశంపై ఐదురోజులు పాటు నిర్వహించనున్న అవగాహనా సదస్సును ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రొఫెసర్ కె. వెంకటరెడ్డి, డాక్టర్ జి.సువర్ణ లక్ష్మి(EFLU) జ్యోతి ప్రజ్వలనతో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఆంగ్లభాషా బోధనలో నూతన విధానాలు, అధునాతన పద్ధతుల్లో బోధనా విధానం గురించి తమ కళాశాల ఆంగ్లభాషా విభాగం, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా విశేష ప్రయోజనం పొందుతారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి నిరంతరం కృషిచేస్తున్నామని, అందులో భాగంగా తమ కళాశాల ఆంగ్లభాషా విభాగం ద్వారా అవగాహనా సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బ్రిటిష్ కౌన్సిల్ తరగతులను తమ కళాశాలలో నిర్వహించడంలో తమ కళాశాల ఆంగ్లభాషా విభాగం ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రొఫెసర్ కె. వెంకటరెడ్డి, డాక్టర్ జి.సువర్ణ లక్ష్మి మాట్లాడుతూ పాఠ్యాంశాలకు, ఆంగ్లభాషకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధ్యాపకులు గుర్తించి మానవీయకోణంలో విద్యార్థులను ఆకట్టుకుంటూ విద్యాబోధన కొనసాగించాలని, తద్వారా ఆంగ్లభాషపై నైపుణ్యం పెంచి భావితరాల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధ్యాపకులకు సూచించారు. ఆంగ్లభాష బోధించే సమయంలో మారుతున్న పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని భోధన కొనసాగించాలని, ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్న ఈ తరహా అవగాహనా సదస్సులు, సెమినార్ల వల్ల అధ్యాపకుల, విద్యార్థుల విజ్ఞానం పెంపొందడమే కాక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నూతన బోధనా పద్దతులను అధ్యాపకులు అభ్యసించడానికి సహకారిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కార్యక్రమ కన్వీనర్ ఎం. మాధవి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







