విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఆనందవేదిక

UPDATED 4th JULY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థులకు చదువులో ఒత్తిడిని తగ్గించడం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, చిన్నతనంలోనే విలువలను వంటపట్టించడం ఆనందమయ తరగతుల ప్రధాన లక్ష్యాలని ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య అన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించిన ఆనంద వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈవో శివరామకృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆనంద వేదిక పేరిట కొత్త విద్యా ప్రణాళిక ప్రారంభించిందని, పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు భాగస్వాములై ప్రార్థన సమావేశానంతరం ఆనంద వేదిక ప్రణాళికను ఆయా తరగతులలో మొదటి అరగంట సమయంలో నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఆనంద వేదిక విషయమై విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరంకానీ, మార్కులు వేసి వాటిని రికార్డుల్లో నమోదు చేయాల్సిన పనికాని లేదన్నారు. తరగతిలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు తమ నిజ జీవితంలో ఆచరించేలా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ బి. శ్రీలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్లూరి వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us