వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి పోయింది :ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబరు 2021 : వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా తిరోగమనంలోకి పోయిందని మాజీ హోమ్ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండల పరిధిలోని తాటిపర్తి, సామర్లకోట పట్టణంలో నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుంకర పావనితో కలిసి ఆయన ఆదివారం మాట్లాడారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్పితే గడిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అలాగే ఓటీఎస్ పేరుతో ప్రజల నుంచి వేలాది రూపాయలు బలవంతపు వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు. కాకినాడ పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుంకర పావని మాట్లాడుతూ జగన్ ముఠా దుశ్శాసన పర్వం, బూతులపై తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేసి సత్తా చాటాలన్నారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, ఆచంట రాజబాబు, పేకేటి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us