UPDATED 21st NOVEMBER 2019 THURSDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం జి. మేడపాడు గ్రామం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఈకేంద్రాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, ఏఎంసి మాజీ చైర్మన్ మోరంపూడి రంగనాయకులు, తదితరులు పాల్గొన్నారు.







