UPDATED 24th JANUARY 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల శ్రీ లక్ష్మి ఆదిత్య స్టూడెంట్స్ హాస్టల్లో వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుని సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. నేపాల్ కు చెందిన విద్యార్థులు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సరస్వతీదేవి విగ్రహం ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో మూడురోజులు పాటు పూజావిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతిరెడ్డి పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విద్యార్థులు మేళతాళాలతో, భాజాభజంత్రీలతో, బాణాసంచా కాలుస్తూ, రంగులు జల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా సరస్వతీదేవి విగ్రహాన్ని సామర్లకోట గోదావరి కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ లో గల వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపక, హాస్టల్ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యాదులు పాల్గొన్నారు.







