ఘనంగా ఏపియూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

* గర్భిణీలకు పోషకాహార కిట్లు పంపిణీ  
* ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని సంఘ నాయకులు పిలుపు

UPDATED 17th AUGUST 2019 SATURDAY 6:00 PM

పెద్దాపురం / సామర్లకోట : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపియుడబ్ల్యుజే పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు అడపా వెంకట్రావు, ఆర్.వి. రమణమూర్తి (బుల్లియ్య), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం, బేబీ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏపియుడబ్ల్యుజే పెద్దాపురం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పలపాటి చంద్రదాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్. సుదీప్తి, డాక్టర్ పి. సునీత మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, యూనియన్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సీనియర్ పాత్రికేయులు అడపా  వెంకట్రావు, ఆర్.వి. రమణమూర్తి (బుల్లియ్య), రాకుర్తి రాంబాబు మాట్లాడుతూ యూనియన్ బలోపేతంతో పాటు పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్క జర్నలిస్ట్ నడుంబిగించి ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించుకోవాలని  పిలుపునిచ్చారు. పాత్రికేయుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతూ వారిపై జరుగుతున్న దాడులను అరికట్టి, పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ఉద్యమ స్ఫూర్తిని అలవరచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనంతరం పెద్దాపురం, సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రుల్లోని గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం, బేబీ కిట్లను వైద్యులు, యూనియన్ సభ్యులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దేవరకొండ సుధాకర్, కోశాధికారి పెమ్మాడి వీరభద్రవర్మ, బద్ది కుమార్, ఎన్.పి.ఎస్. వినాయక్, బిక్కిన వెంకట్, ఇర్షాద్ ఆలీ, సిద్దిరెడ్డి సూరిబాబు, చవ్వాకుల ఈశ్వరరావు, పిడపర్తి విక్రమశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us