UPDATED 12th MARCH 2020 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ సిపి పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్థానిక ప్రసన్నాంజనేయనగర్ లోని పార్టీ కార్యాలయంలో వృద్ధురాలుచే కేక్ కట్ చేయించి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పయనం కొనసాగిస్తూ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, గోలి వెంకట అప్పారావు చౌదరి, సేపేని సురేష్, పి. సత్యనారాయణ, మట్టపల్లి రమేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







