శ్రీ శృంగారవల్లభస్వామి దేవాలయం అభివృధ్ధికి మాస్టర్ ప్లాన్

UPDATED 27th FEBRUARY 2020 THURSDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మండలం తిరుపతిలోని శ్రీ శృంగారవల్లభస్వామి ఆలయాన్ని    మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృధ్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ బి.వి.ఎస్. దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం దేవాలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని  దర్శించుకున్న అనంతరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆయనను  శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం, చిత్రపటాలను అందచేశారు. ఈ సందర్భంగా డిసి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తొలి తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శృంగారవల్లభ స్వామి దివ్య క్షేత్రానికి వేలాదిగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రాజ గోపురాలు, అన్నదాన, కార్యాలయ భవనాలు, కళ్యాణవేదిక, కళావేదిక, యాగశాల, వాహనశాల, గోశాల, ప్రసాదాలు, నైవేద్యాలు తయారీకి పాకశాల, డార్మెటరీ, వసతి భవనం, ఆర్ఓ ప్లాంట్, ఆర్చిగేట్, ధ్వజస్తంభ పునర్నిర్మాణం,  ఆలయములోని నూతిలోని పవిత్ర నీటితో జల్లు స్నానం, టిఎంఎస్ టికెట్ కౌంటర్లు, తాత్కాలిక పూజా విక్రయ స్టాల్స్ వంటి పలు నిర్మాణాలు, క్యూలైన్స్, పందిళ్లు, పార్కింగ్, మైక్ అండ్ పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, విధ్యుత్ అలంకరణలు, బల్గర్ అలారం, సిసి కెమెరాలు, గార్డెన్, ప్రాకారంలో ఎర్త్  ఫిల్లింగ్ వంటి పలు సదుపాయములతో పాటుగా జిల్లాలో ప్రముఖ ప్రదేశాలలో హోర్డింగ్స్, మార్గం, స్ధల పురాణం బోర్డులు  ఏర్పాటుకు అంచనాలు మాస్టర్ ప్లాన్ ప్రకారం రూపొందించడం జరుగుతుందని అయన పేర్కొన్నారు. ఆయన వెంట సహాయ ఇంజనీరు రాజు, ఉప కమీషనరు కార్యాలయ పర్యవేక్షకులు కె. నాగేశ్వరరావు, వి. సోమరాజు, తనిఖీదారు వి.ఎల్.ఎన్.రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us