గిరిజన విద్యార్థులకు ప్రామాణిక విద్య

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో  ప్రవీణ్ ఆదిత్య  
* నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షా సమావేశం 

UPDATED 2nd JUNE 2020 TUESDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గిరిజన బాలబాలికలకు దిగువస్థాయి నుంచి ప్రామాణిక విద్య, అన్నిరకాల కనీస వసతుల కల్పనతో విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమానికి ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, సర్వశిక్షాభియాన్ ఇంజనీర్లు, విద్యాశాఖ,గిరిజన సంక్షేమ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమాల ద్వారా పాఠశాలలకు నిరంతర మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, నరేగా ద్వారా ప్రహరీ గోడలు నిర్మాణం, ఫర్నీచరు, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల భవనాలకు మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిసిటీ వంటి తొమ్మిది అభివృద్ధి సూచికలతో మంచి పురోగతి సాధించి విద్యార్థులు విద్యను అభ్యసించేలా సమిష్టి కృషితో అంకితభావంతో పాటుపడాలన్నారు. డివిజన్ పరిధిలోని అడ్డతీగల మండల పరిధిలో 16 పాఠశాలల్లో నాడు-నేడు వసతుల కల్పనకు పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గంగవరం మండల పరిధిలో 18 పాఠశాలల్లో సర్వ శిక్షాభియాన్, దేవీపట్నం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, రంపచోడవరం, వై.రామవరం మండలాల పరిధిలోని 103 పాఠశాలల్లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వహక ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయని, మొత్తంగా ఏజెన్సీ పరిధిలో 137 పాఠశాలల్లో నాడు-నేడు వసతులు కల్పనకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పూర్తి చేసిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు  రూపొందించి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, సైట్ ఇంజనీర్లను ఆదేశించారు. పాఠశాలలు పున: ప్రారంభం నాటికి నాడు-నేడు కార్యక్రమాలు పూర్తి చేయాలని, ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన యాప్ ద్వారా ఎప్పటికపుడు బిల్లులు చెల్లింపులు జరపాలని ఆదేశించారు. నాడు-నేడు పనుల్లో ఎక్కడా, ఎలాంటి జాప్యం  లేకుండా నిర్దిష్ట  ప్రణాళికలను రూపొందించి ఆ ప్రకారం పనులు అత్యంత నాణ్యతతో చేపడుతూ నాడు-నేడు కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచేలా అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎం. సరస్వతి, ఈఈ పి. రమాదేవి, పంచాయితీరాజ్ శాఖ డిఈ డి. దుర్గాప్రసాద్, గిరిజన సంక్షేమాధికార్లు సుజాత, శంభుడు, ఎఎంవో దేవప్రసాద్, మండల విద్యాశాఖాధికారులు, పలు విభాగాలకు చెందిన ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us