UPDATED 14th AUGUST 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించే లక్ష్యంలో భాగంగా తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, తదితర రెవిన్యూ సిబ్బందితో కలిసి బుధవారం ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతీ పేదవాడికి పక్కా గృహం నిర్మిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని, అందులో భాగంగా పట్టణ, మండల పరిధిలో సుమారు 40 ఎకరాలు దేవాదాయ, వివిధ ప్రభుత్వ స్థలాలను పరిశీలించామని అన్నారు. ఉప్పువారి సత్రం, లిక్కర్ బోట్లింగ్ పక్కన ఉన్న ప్రభుత్వ భూములు, అలాగే భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న దేవాదాయ భూములు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ అప్పారావు, లైసెన్స్ సర్వేయర్ సుబ్బారావు, విఆర్ఓలు లొవరాజు, భరత్, సత్య కిరణ్, తదితరులు పాల్గొన్నారు.







