UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 6:30 PM
సామర్లకోట: పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శని-నగర వికాసం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు అన్నారు. పట్టణ పరిధిలోని 27వ వార్డు అయోధ్యరామపురం, దుర్గగుడి ప్రాంతాల్లో నగరదర్శని-నగర వికాసం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గత నాలున్నర సంవత్సరాలలో వార్డులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాజమహేంద్రవరం భాషా సాంస్కృతిక శాఖ ఎస్. చలం జానపద కళాబృందంచే కళాజాతా ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించారు. అలాగే రాబోయే కాలానికి సంబంధించి వివిధ పధకాల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి కావలసిన సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







