* ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
UPDATED 28th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: దేశ, రాష్ట్ర రాజకీయరంగంలో తిరుగులేని మహానేతగా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ పలువురు టిడిపి నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మఠం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహాన్నతవ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశం నలుమూలలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అనంతరం పేదవారికి దుస్తులు పిల్లలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో భీమేశ్వర ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.







