డిసెంబర్ 21 నుంచి భూములు రీసర్వే

* ఆర్డీవో మల్లిబాబు

UPDATED 9th DECEMBER 2020 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డివిజన్ పరిధిలో తొలి విడతగా 91 గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షా పథకం క్రింద భూములు రీసర్వే ఈనెల 21 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వే, సరిహద్దుల చట్టం - 1923 సెక్షన్ 6(1) క్రింద డివిజన్ పరిధిలో 91 రెవెన్యూ గ్రామాల్లోని భూముల రిజిస్టర్ హోల్డర్లు లేదా హక్కు, అనుభవదారులు రీసర్వే జరిగే సమయంలో స్వయంగా కానీ లేదా తమ ఏజెంట్లు కానీ హాజరై వారి హక్కులను తెలియచేయాలని అన్నారు. ఈ సర్వే ప్రకటనకి సంబంధించి మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామ సచివాలయాలు, తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల నోటీస్ బోర్డులో ప్రచురణ కాపీలను ఉంచినట్లు ఆర్డీవో తెలిపారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us