ఆదిత్యలో నేత్రపరిరక్షణపై అవగాహనా సదస్సు

UPDATED 24th MARCH 2018 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కంటి పరిరక్షణపై విద్యార్థులకు కాకినాడ శ్రీ కిరణ్ నేత్ర చికిత్సాలయం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ. రమేష్ మాట్లాడుతూ సంకురాత్రి ఫౌండేషన్ ఏర్పాటుచేసి ఉచితంగా ఎందరో అభాగ్యులకు కంటి వెలుగు ప్రసాదిస్తున్న చంద్రశేఖర్ అందరికీ ఆదర్శప్రాయులని, ప్రతీ ఒక్కరూ నేత్ర పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. శ్రీ కిరణ్ నేత్ర చికిత్సాలయం వైద్యులు డాక్టర్ శివరామకృష్ణ, సురేష్ నేతృత్వంలో విద్యార్థులకు కంటి వ్యాధులు, పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి పి. రవికుమార్, ఎన్ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాల మోహన్ రాజు, ఎం. సోమిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us