పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

UPDATED 26th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా అమలు చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఎంతో అవసరమని మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా స్థానిక 17వ వార్డు వీర్రాఘవపురం, కృష్ణుడు గుడి వీధి ప్రాంతాల్లో శుక్రవారం మున్సిపల్ బృందం పర్యటించారు. రాజమహేంద్రవరం భాషా సాంస్కృతిక శాఖకు చెందిన కళాకారులు ఎస్. చలం బృందం ప్రభుత్వ పథకాలపై కళాజాతాల ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు. వార్డులో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us