విద్యార్థులకు వైద్యసేవలు సక్రమంగా అందించాలి

UPDATED 20th NOVEMBER 2019 WEDNESDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): విద్యార్థులకు వైద్య సేవలు సక్రమంగా అందేలా మానసిక వికలాంగుల కేంద్రాల నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని పెద్దాపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ పేర్కొన్నారు. సామర్లకోట పట్టణంలో గల సిరి మానసిక వికలాంగుల పాఠశాల, పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలోని శాంతివర్ధన పాఠశాలలను ఆయన బుధవారం సందర్శించి అక్కడ అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిరి మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రత్నకుమార్ మాట్లాడుతూ మానసిక వికలాంగ విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులు సంబంధిత కేంద్రాలను నెలకు రెండుసార్లు సందర్శించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా జిల్లా వైద్యాధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పులిమేరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ డాక్టర్ ధనలక్ష్మి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సిరి మానసిక వికలాంగుల కేంద్రం హెచ్ఎం మోపిదేవి, దేవేంద్ర కుమార్, మడికి రాంబాబు, ప్రభూజీ, విజయ్ కుమార్, నూతలపాటి అప్పలకొండ, బి.ఎస్.ఎన్ మూర్తి, కుంచే నానిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us