UPDATED 29th JANUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని కాకినాడ రూరల్ ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు అన్నారు. కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మహిళలు, కార్మికులు పోలవరం సందర్శన నిమిత్తం 25 బస్సుల్లో మంగళవారం పయనమయ్యారు. ఈ యాత్రను స్థానిక రాక్ సిరమిక్స్ కంపెనీ వద్ద ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపినా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ మార్గాల్లో నిధులు సేకరించి ప్రాజెక్టు పూర్తి చేస్తునట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలకు తగిన సమాధానం చెప్పేందుకే ఈ యాత్ర సందర్శన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవు వెంకన్న, గుబ్బల ప్రసాద్, డి.హెచ్.వి. సాంబశివరావు, రెడ్డి భద్రం, కోతి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.







