UPDATED 1st JANUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొరకు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నయ్యదొర పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్యదొర మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వివిధ గ్రామాల ప్రజలు నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటున్నారని, అలాగే భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకన్న, గౌరవ అధ్యక్షులు కాటంరెడ్డి వీరబాబు, ఉపాధ్యక్షులు కాటంరెడ్డి దొరబాబు, పట్టణ గౌరవ అధ్యక్షులు కరప గంగయ్యదొర, పట్టణ అధ్యక్షులు ఫణికుమార్, కార్యదర్శి వడ్డాది శివ, జాయింట్ సెక్రెటరీ చుక్కా రమణ, తదితరులు పాల్గొన్నారు.







