గైట్ లో త్రీడి ఎక్స్ పీరియన్స్ ఆన్ వీల్స్ అధునాతన బస్సు

UPDATED 10th NOVEMBER 2018 SATURDAY 6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల విద్యార్థులకు త్రీడి కోర్సులపై అవగాహన కల్పించే నిమిత్తం త్రీడి ఎక్స్ పీరియన్స్ ఆన్ వీల్స్ (చక్రాలపై విజ్ఞానం) అనే అధునాతన బస్సు శనివారం వచ్చింది. త్రీడి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కోర్సుల  వారికి వాటి అవసరం తెలిపే విధంగా డసల్ట్ సిస్టమ్స్ సంస్థ సహకారంతో ఈ యాత్ర నిర్వహిస్తోంది. అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ బస్సు జిల్లాలో తొలిసారిగా గైట్ కళాశాలకు రావడంతో దీనిని సందర్శించేందుకు విద్యార్థినీ, విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్సులో  త్రీడి నమూనాలు ఏవిధంగా ఉంటాయో ఉదాహరణలు, ఈ కోర్సు పూర్తిచేస్తే లభించే అవకాశాలు గురించి విద్యార్థులకు ప్రదర్శించారు. అలాగే త్రీడి కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వివరించారు. త్రీడి ఎక్స్ పీరియన్స్ ఆన్ వీల్స్ అనే అధునాతన బస్సు ఇంతవరకు దేశంలో 22 రాష్ట్రాలు చుట్టివచ్చిందని షో బీజ్ ఎక్స్ పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ పార్టనర్ రోహన్ పింటో తెలిపారు. ఈ ఏడాది జూన్ ఏడవ తేదీన పూణేలో ఈ బస్సు యాత్ర  ప్రారంభమైందని, 22 రాష్ట్రాల్లోని పలు ఐఐటిలు, ఎన్ఐటిలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలను సందర్శించి ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు త్రీడి కోర్సులపై తరగతులు నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం 23వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో కళాశాలలను సందర్శిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ యాత్ర సాగుతుందని, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో డిసెంబర్ 13 లేదా14 తేదీల్లో ఈ యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, సిఇవో డాక్టర్ డిఎల్ఎన్ రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు డాక్టర్ కె. సుబ్బారావు, వి. సుబ్రహ్మణ్యం, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, తదితరులు ఈ బస్సును సందర్శించారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us