వ్యాసకర్త డాక్టర్ మెహర్జీ దువ్వూరికి అభినందనలు

UPDATED 8th OCTOBER 2018 MONDAY 9:00 PM 

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ స్కూల్ అధ్యాపకులు డాక్టర్ మెహర్జీ దువ్వూరిని కళాశాల యాజమాన్యం సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి మాట్లాడుతూ ఆడిటర్ల నిస్పాక్షిక, సంశయాత్మకత అనే వ్యాసం రచించినందుకు ఆయనను అభినందించినట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసిడబ్యుఏఐ జర్నల్ ది మేనేజ్ మెంట్ అకౌంటెంట్ అనే సంచికలో మెహర్జీ వ్యాసం ప్రచురితమైందని, ఇది తమ కళాశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో ఉన్న అధ్యాపకులను, విద్యార్థులను పరిశోధనలకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాసం ఆడిటర్ల విధి నిర్వహణ, కాలానుగుణంగా ఏవిధంగా మారిందో ఆయన రాసిన వ్యాసంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us