Updated 25 January 2022 Tuesday 07:00 PM
ముంబయి (రెడ్ బీ న్యూస్): కర్ణాటకలోని తమకూరు మహీంద్రా ఎస్వీయూ షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ షోరూంలో రైతుకు జరిగిన అవమానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బొలెరో వాహనం కొనేందుకు ఓ రైతు, తన స్నేహితులతో కలిసి మహీంద్రా షోరూంకు వెళ్లాడు. వారి వేషధారణ చూసిన అక్కడి (Mahindra SUV showroom) షోరూంలోని సేల్స్ మ్యాన్ ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఘటనపై సీరియస్‌గా తీసుకున్నారు. @MahindraRise ప్రధాన ఉద్దేశం.. కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడమే.. వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడమేనన్నారు.
తత్వశాస్త్రం ప్రకారం.. ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు సత్వరమే పరిష్కారం చూపడం జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి వార్త కథనాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. దానికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో విజయ్ నక్రా స్పందించారు.కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్‌లు అంతర్భాగమని తెలిపారు. మా కస్టమర్‌లందరినీ మేం ఎల్లప్పుడూ గౌరవిస్తామన్నారు. ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని విజయ్ నక్రా (Mahindra CEO Veejay Nakra) రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు.ఇటీవల.. బొలెరో పిక్-అప్ ట్రక్కును కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని Kempegowda అనే రైతు షోరూమ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తనకు కారు కొనడం కష్టమని సేల్స్‌మ్యాన్ అవమానించాడు. ఆ రైతు సేల్స్ మ్యాన్ వ్యాఖ్యలకు ఛాలెంజ్ విసిరాడు. స్నేహం కోసం సినిమాలో మాదిరిగా.. ఒక గంటలో రూ. 10లక్షల నగదుతో షోరూంకు తిరిగి వచ్చాడు. ఈ ఘటనలో ఇరువురి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆ సేల్స్ మ్యాన్ రైతుకు క్షమాపణలు చెప్పాడు.,







