బొద్దింకలపై ఆర్ట్‌ వర్క్‌!

రెడ్ బీ న్యూస్,19 జనవరి 2022: బొద్దింకలను చూస్తే చాలా మంది భయపడతారు. మరి కొంత మంది అసహ్యించుకుంటారు. కానీ ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు చెందిన బ్రెండా డెల్గాడో అనే ఆర్టిస్టు మాత్రం బొద్దింక కనిపిస్తే దానిపై రంగులతో అద్భుతాలు చేస్తాడు. ఆయిల్‌ పెయింటింగ్స్‌తో మెరిసిపోయేలా తీర్చిదిద్దుతాడు. బొద్దింకపై ఆర్ట్‌ ఎలా సాధ్యమంటారా? ఈయన ఆర్ట్‌ వర్క్‌ చేసేది చనిపోయిన బొద్దింకలపైన మాత్రమే. 30 ఏళ్ల బ్రెండా డెల్గాడో ఒకరోజు తన పనిస్థలాన్ని శుభ్రం చేసే సమయంలో బొద్దింకలతో పాటు ఇంకొన్ని పురుగులు చనిపోయి ఉండటాన్ని గమనించాడు. బొద్దింకల రెక్కలు స్మూత్‌గా, షైనీగా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆలోచన తట్టింది. వాటిపై ఆయిల్‌ పెయింట్స్‌తో స్పైడర్‌మ్యాన్‌, హల్క్‌ వంటి కొన్ని బొమ్మలు వేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకేం... బ్రెండా ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే ఆర్ట్‌ కోసం ప్రత్యేకంగా బొద్దింకలను చంపకండి అంటూ కొందరు సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us